ఈ కొరియన్ పానీయాలు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి

-

నేటి జంక్ ఫుడ్ యుగంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడటం చాలా కష్టం. ఏం తింటే క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతామో అని భయపడే వాళ్లు కొందరైతే.. ఎట్లుంటే ఏంటి.. టేస్టీగా ఉందా లాగించేయాల్సిందే అనుకునేవాళ్లు ఇంకొందరు.. ఎవరైనా సరే.. ఒక స్టేజ్‌కు వచ్చాక.. బరువు తగ్గాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వారికి తెలుస్తుంది..ఈ బిర్యానీలు, ఫ్రైడ్‌ రైస్‌లు, రోడ్డుపక్కన గడ్డీ ఇంక తినకూడదని.. బరువు తగ్గాలంటే ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తారు..! మీలో చాలామంది కొరియన్‌ సిరీస్‌ చూస్తూనే ఉంటారు కదా..! వాళ్లు స్కిన్‌ టోన్‌ నుంచి బాడీ వరకూ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి కదా..! బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే కొరియన్‌ పానీయాలు కొన్ని ఉన్నాయి.. అవి ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..! వీటి వల్ల మీరు కూడా త్వరగ్గా కొవ్వు కరిగించుకోని బరువు తగ్గొచ్చు..

బరువు తగ్గడానికి సహాయపడే కొరియన్ పానీయాలు

బార్లీ టీ :

బార్లీ టీ ఒక ప్రసిద్ధ కొరియన్ పానీయం. ఇది దాని రుచి మరియు వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ టీ చేయడానికి…రోస్ట్‌ చేసిన బార్లీ గింజలను వేడి నీటిలో మరిగించండి.. ఇవి కెఫిన్ లేనివి మాత్రమే కాకుండా కేలరీలు కూడా చాలా తక్కువ. ఇతర చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవచ్చు.

గ్రీన్ టీ :

కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి గ్రీన్ టీ. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో జీవక్రియను పెంచడమే కాకుండా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గే పనిలో ఉన్నవారు కచ్చితంగా దీన్ని తీసుకోవాలి.

రోజ్ టీ :

దీనిని గుల్చా టీ అని కూడా అంటారు.. ఇది బరువు తగ్గడానికి సమర్థవంతమైన కొరియన్ పానీయం. ఇది కుంకుమపువ్వు మరియు గులాబీ రేకులతో చేస్తారు. వీటిలో విటమిన్ సి మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గొప్ప రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.

ఒమిజా టీ :

దీన్ని ఐదు రకాల రుచులతో బెర్రీ టీ అంటారు. ఇది Schisandra chinensis మొక్క యొక్క పండ్లను ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. వీటిలో తీపి, పులుపు, లవణం, చేదు, మసాలాలు అన్ని రకాల మిశ్రమంగా ఉంటాయి. ఈ టీ యొక్క వాసన వర్ణించడం దాదాపు అసాధ్యం. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news