ఓటీఎస్‌ పథకంపై సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త‌..పేదలపై రూ.10వేల కోట్ల భారం త‌గ్గింపు

-

ఓటీఎస్‌ పథకం, గృహ నిర్మాణంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభ‌వార్త చెప్పారు. ఓటీఎస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలని… ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందమ‌న్నారు. ల‌బ్ది దారుల‌కు ఇష్ట‌మైతేనే… ఓటీఎస్ కు ఓకే చెప్పాండి ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని… రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. వారి రుణాలు మాఫీచేస్తున్నామ‌ని.. రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం జ‌గ‌న్‌.

వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి, వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని… గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదని వెల్ల‌డించారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని.. తెలిపారు. గ‌తంలో అసలు, వడ్డీ కడితేనే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని.. ఇప్పుడు ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామ‌న్నారు. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుందని వెల్ల‌డించారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామ‌న్నారు జ‌గ‌న్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version