బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ లకు చెందిన ఖాతాదారులు ఇప్పుడు చెప్పబోయే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాంకులు పలు రూల్స్‌ను వచ్చే నెల నుంచి మార్చుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యాంకులు ప్రకటనలను విడుదల చేశాయి. చెక్కులు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లకు సంబంధించి ఈ బ్యాంకుల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఖాతాదారులు బ్యాంక్‌లో పాజిటివ్ పే ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అధిక విలువ కలిగిన చెక్కులను ప్రాసెస్ చేసే సమయంలో బ్యాంకు పాజిటివ్ పే ను ఉపయోగించుకుంటుంది. రూ.2 లక్షల కన్నా విలువైన చెక్కులను ప్రాసెస్ చేసేటప్పుడు బ్యాంకు కస్టమర్‌ను మరోసారి వివరాలు అడుగుతుంది. దీంతో వారు ఆ వివరాలను వెరిఫై చేయాలి. ఇందుకు గాను జూన్ 1 తేదీ తరువాత ఈ బ్యాంక్ కస్టమర్లు తమ అకౌంట్లలో పాజిటివ్ పే ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మోసాలను నివారించవచ్చు.
ఇక జూన్, జూలై నెలల్లో కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంక్ లో గతేడాది ఏప్రిల్‌లో విలీనం చేశారు. దీంతో ఈ బ్యాంకులకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి. కెనరా బ్యాంకులకు చెందిన కోడ్‌లు జూలై 1వ తేదీ నుంచి,సిండికేట్ బ్యాంక్‌కు చెందిన కోడ్‌లు జూన్ 30వ తేదీ నుంచి మారుతాయి. అప్‌డేట్ అయిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల వివరాలను ఆయా బ్యాంకులకు చెందిన వెబ్‌సైట్లలో ఖాతాదారులు తెలుసుకోవచ్చు.