ట్రంప్ గెలుస్తారు అంటున్న బెట్టింగ్ బంగార్రాజులు…!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రారంభ ఫలితాలు డొనాల్డ్ ట్రంప్‌ పై డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌ కు ఆధిక్యంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ, బెట్టింగ్ మార్కెట్లు రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్‌ కు అనుకూలంగా పందాలను వేస్తున్నాయి. బెట్టింగ్ అధికారికంగా జరిగే దేశాల్లో ట్రంప్ కే జై కొడుతున్నారు. న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు దేశాల్లో ఈ పరిస్థితి కనపడుతుంది. బ్రిటిష్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ బెట్ఫేర్పై బెట్టర్లు.. రెండవసారి ట్రంప్ గెలిచే అవకాశాలు 75% అని చెప్తున్నారు.

అంచనాల ప్రకారం చూస్తే… డొనాల్డ్ ట్రంప్ జో బిడెన్ కంటే 62 సెంట్ల నుండి 37 సెంట్ల వరకు ఆధిక్యంలో ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. కాగా గెలుపు విషయంలో మాత్రం ఇద్దరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో ఎన్నికల విజయంపై ఒక స్పష్టత వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version