దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు… హరీష్ పరిస్థితి?

-

ఎన్నికలు ముగిసాయి.. ఇక మిగిలింది ఫలితాలు. కాకపోతే ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావిడి మొదలైపోయింది! బెట్టింగుల గురించి చెప్పేదేముంది! అయితే ఎవరూ ఊహించని విధంగా దుబ్బాకలో కమలం వికసిస్తుందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు! అదే జరిగితే హరీష్?


అవును… తాజాగా విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అధికార పార్టీకంటే కమలానికే అనుకూలంగా ఫలితాలు చెబుతున్నాయి. బండి సంజయ్ అధ్యక్షుడైన మొదటి ఎన్నికలు ఎవ్వడం వల్లో ఏమో కానీ ఆయన ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతోపాటు.. కరోనా సమయంలో ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకత కూడా తోడయ్యిందని.. వాటి ఫలితమే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని అంటున్నారు!

ఈ క్రమంలో… సుమారు 82శాతం పోలింగ్ నమోదైంన ఈ ఎన్నికల్లో… ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్త బలంగా పడటంతోపాటు.. కాంగ్రెస్ కూడా వెనకబడిపోవడంతో అది కాస్తా బీజేపీకి ప్లస్ అయ్యిందని చెబుతున్నారు. విశ్లేషణలు కూడా కాస్త బీజేపీకి అనుకూలంగా సాగకపోయినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగాయని.. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవడంలో బండి సంజయ్ నాయకత్వం, వ్యూహాలు బాగా ఫలించాయనేది వారి వాదనగా ఉంది!

అయితే ఈ ఎన్నికల్లో జరుగుతున్న ఊహాగాణాలకు అనుకూలంగా ఫలితాలు వస్తే మాత్రం బలయ్యేది హరీష్ రావే అనే మాటలు అప్పుడే మొదలైపోయాయి! అధికార టీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఒక్కరే ఈ ఎన్నికలను అధికారపార్టీ తరుపున లీడ్ చేశారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ అటువైపు తొంగిచూసిన దాఖళాలు లేవు. సో… ఈ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ హరీష్ కు ఎంతవరకూ ఇస్తారో లేదో తెలియదు కానీ… వ్యతిరేకంగా వస్తే మాత్రం కచ్చితంగా హరీష్ బలి అనేమాటలు వినిపిస్తున్నాయి!!

మరి నవంబర్ 10న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న పరిస్థితుల్లో… ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా లేక అధికారపక్షం కాన్ ఫిడెన్స్ కి న్యాయం జరుగుతుందా లేక.. ఊహించని షాక్ తప్పదా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version