వాళ్ల‌కు భూమ్మీద బ‌తికే అర్హ‌త లేదు.. అమితాబ్ చావాలి : ఎందుకీ ట్రోలింగ్‌?

-

సినీ యాక్టర్ ల పై ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఇరువురు ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకునేవి.. రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు భారతీయ చలనచిత్ర వేదిక మీద ఓ వెలుగు వెలిగిన అమితాబ్ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎప్పుడూ శాంతంగా ఉండే అమితాబ్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ఆగ్రహానికి కారణం ఏమిటి అందరూ అనుకుంటున్నారు… సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి అమితాబ్ ను కరోనా బారినపడిన చనిపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టాడు. నీ గమ్యం ఇక్కడితో ఆగిపోవాలంటే తన కోపాన్ని విషం లాగా బయటకు చెప్పాడు.

Amithab
Amithab

32 ఏళ్ల క్రితం బచ్చన్ కి ఓ పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా అభిమానులు అతనికి తొందరగా నయం అవ్వాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అమితాబ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత అభిమానులందరూ దేశవ్యాప్తంగా కదిలి మహా యాగమే జరిపించారు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ సినీ ప్రపంచం మొత్తం కదిలి అమితాబ్ కి తొందరగా నయం అవ్వాలని ఆకాంక్షించారు. నేటికీ తన ఆరోగ్యం బాగానే ఉందని ఎప్పటికప్పుడు అభిమానులకు ట్విట్టర్ వేదికగా అమితాబ్ చెబుతూనే వస్తున్నారు.

ఇప్పుడు అమితాబ్ ట్విట్టర్ వేదికగా కోపాన్ని ప్రదర్శిస్తూ నేను కరోనా తో చావను అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కోరిక నెరవేరదని నా అభిమానులు పూజలు ఫలిస్తాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news