ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ అటు పోలీసులకు, ఇటు సామాన్య ప్రజలు, వీధి వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసుల పాట్రోలింగ్ లేక దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.అలాయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని అపహరించారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. దొంగలను ఎలాగైనా త్వరగా పట్టుకోవాలని భైంసా ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు.