తల్లీ నీకు వందనం.. వెయ్యేళ్లు వర్ధిల్లు..!

-

కరోనా కష్టకాలం.. వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.. ఉన్న ఊళ్లో పనిదొరకదని, దొరికినా వచ్చే అరకొర మొత్తంతో జీవితాలను వెళ్లదీయడం కష్టమని భావించిన వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పడితే.. కరోనా మహమ్మారి వారిని సొంతూళ్లకు నిర్దాక్షిణ్యంగా తరిమేసింది. దీంతో దిక్కు తోచని స్థితిలో కొందరు కాలం గడుపుతున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని మనస్సున్న మహానుభావులు ఆదుకుంటున్నారు. ఆ జాబితాలోకి ఈ చిట్టి తల్లి కూడా వచ్చి చేరింది.

నోయిడాకు చెందిన 12 ఏళ్ల నిహారిక ద్వివేది అనే బాలిక తన పాకెట్‌ మనీని ఎప్పటి నుంచో పొదుపు చేసుకుంటూ వస్తోంది. దీంతో ఆ మొత్తం రూ.48వేలకు చేరింది. అయితే తమ ప్రాంతంలో ఉండే వలస కూలీలు ముగ్గురు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వారి వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ బాలిక తాను పొదుపు చేసుకున్న రూ.48వేలతో విమాన టిక్కెట్లను కొని వారికి ఇచ్చింది.

మన సమాజం, మన ఊరు నాకు ఎంతో ఇచ్చాయి. కనుక నేను కూడా సమాజానికి నాకు తోచినంత తిరిగి ఇవ్వాలి. సమాజంలో మనమే కాదు.. పేదలూ ఉన్నారు. కేవలం మనం మాత్రమే మన కుటుంబంతో ఉండాలి అనుకోకూడదు.. వారికీ కుటుంబాలు ఉంటాయి.. ఈ కష్టకాలంలో వారు కూడా వారి కుటుంబాల వద్దే ఉండాలి.. అని ఆ బాలిక అంటోంది.. ఆ బాలిక దాతృత్వాన్ని నిజంగా అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version