వామ్మో జింకను ఎలా కొండ చిలువ మింగిందో చూడండి…!

-

కరోనా లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో పలు వీడియో లు జనాలకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. అడవి జంతువులకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక జింక ను కొండ చిలువ మింగుతూ ఉంటుంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్, “నమ్మసక్యం కాని విధంగా ఈ బర్మీస్ పైథాన్ చాలా ఆకలితో ఉంది, కాబట్టి మొత్తం జింకను మింగేసింది. అనే కామెంట్ తో వీడియో ని పోస్ట్ చేసారు. వీడియో లో భారీ బర్మీస్ పైథాన్ ఉంటుంది… రెండు నిమిషాల వీడియోలో పాము నెమ్మదిగా మొత్తం జింకలను నోటిలోకి తీసుకున్నట్టు కనపడుతుంది. మీరు జాగ్రత్తగా గమిస్తే దానిది చాలా పెద్ద నోరు.

కుందేలు లేదా ఎలుకలు వంటి చిన్న జంతువులను పాములు మింగే వీడియోలు చాలా సాధారణంగా మనకు కనపడుతూ ఉంటాయి, కానీ పైథాన్ మొత్తం జింకను మింగుతున్న వీడియో మాత్రం చాలా అరుదుగా కనపడుతుంది. పాము దాన్ని ఏ విధంగా జీర్ణించుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “పాములకు జీర్ణక్రియ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news