రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ : సరిలేరు సాంగ్ కి 100 మిలియన్ వ్యూస్ ..!

-

2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు దిగిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 ప్రారంభంలోనే అద్భుతమైన హిట్ ని సాధించారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

sarileruneekevvaru hashtag on Twitter

ఇక ఈ సినిమాతో పాటు వచ్చిన అల వైకుంఠపురములో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాంతి రేస్ సాగింది. ఈ రేస్ లో ఎవరికి వారే బ్లాక్ బస్టర్స్ ని సాధించారు. ఇక మ్యూజిక్ పరంగానూ ఈ రెండు సినిమాలకి ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇక్కడ కూడా రెండు సినిమాలు మ్యూజిక్ బెస్ట్ అనిపించుకున్నాయి. ఇక సినిమాతో మహేష్ బాబు ఒక కొత్త రికార్డ్ సాధించారు. సరిలేరు సినీఅలోని “హి ఈజ్ సో క్యూట్” లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని టాప్ ప్లేస్ లో నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా ఆల్బంలో బెస్ట్ సాంగ్స్ లో ఎక్కువగా ట్రెండ్ అయింది ఈ సాంగే. ఇప్పుడు ఈ సాంగ్ ప్రేక్షకులనుండి విపరీతమైన ఆదరణ పొంది 100 మిలియన్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకొని రికార్డ్ క్రియోట్ చేసింది. ఇక ఈ సినిమానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా “హి ఈజ్ సో క్యూట్” సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా, మధు ప్రియా పాడింది.

Read more RELATED
Recommended to you

Latest news