ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాలేయం అనేక రకాల పనులను చేస్తుంది. దానిని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే కాలేయ ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఈ ఆహారం తీసుకోవడం మంచిది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..!
వెల్లుల్లి:
వెల్లుల్లి లో విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మ్యాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి నిజంగా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది/ అలానే ఎంజైమ్స్ ని ఆక్టివేట్ చేస్తుంది. హానికరమైన వాటి నుంచి ఇది కాపాడుతుంది. కాలేయంలో ఇలా సమస్యల్ని వెల్లుల్లి సులువుగా తొలగిస్తుంది.
బీట్ రూట్:
బీట్రూట్ కూడా కాలేయానికి చాలా మంచిది. బీట్రూట్ బీపీని తగ్గించడానికి, జీర్ణ క్రియని మెరుగుపరచడానికి, డయాబెటిస్ రిస్కు తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటుగా ఇది లివర్ క్యాన్సర్ కి బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ లో ఎక్కువగా ఫ్లెవనాయిడ్స్ మరియు బీటాకెరోటిన్ ఉంటాయి ఇవి కాలేయం ఆరోగ్యాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడతాయి.
నిమ్మకాయలు:
నిమ్మ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. మీరు ఆహారం లో నిమ్మకాయని ముక్కలుగా చేసి ఉపయోగించవచ్చు లేదు అంటే నిమ్మకాయ నీళ్లు తాగవచ్చు. ఇలా నిమ్మకాయ కూడా కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
కాఫీ:
స్టడీస్ ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి రోజు కాఫీని తాగడం వల్ల అది లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే లివర్ క్యాన్సర్ రాకుండా ఇది సహాయ పడుతుంది. ఇది ఇంఫ్లేమేషన్ ను కూడా తగ్గిస్తుంది.