ఈ రోజుల్లో వాట్సాప్ చాట్ అనేది చాలా కీలకం అయింది. వ్యక్తిగత, వ్యాపార, కుటుంబ ఇలా అన్నీ కూడా వాట్సాప్ లో చాలా కీలకం అయిపోయాయి అనేది వాస్తవం. మరి మన వాట్సాప్ లో చాట్ ఎంత సేఫ్…? దీనికి సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. వాట్సప్ ఛాటింగ్, మీడియా, ఇతర సమాచారం ఇలా ప్రతీ దాంట్లో సెట్టింగ్స్ అనేవి కచ్చితంగా ఉంటాయి.
వాటిని మార్చుకుని సెట్టింగ్స్ సరిగా ఉంచితే వాట్సాప్ సేఫ్ గా ఉంటుంది. వాట్సప్‌లో టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ లాక్ ఉంటుంది. మీ వాట్సప్‌ని లాక్ చేయడానికి ఇది చాలా అవసరం. వాట్సప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లో ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ ఉంటుంది. దీనిని మీరు ఎనేబుల్ చేస్తే వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కీలకం. గూగుల్‌లో ఉన్నట్టు గానే వాట్సప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి… 6 అంకెల పిన్ ఎంటర్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి.
ఇది చేసుకుంటే మీ వాట్సాప్ అసలు హ్యాక్ అవ్వదు. వాట్సప్ సెట్టింగ్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. మీ స్టేటస్, ప్రొఫైల్ ఫోటో లాంటివి ఎవరు చూడాలో మీరే సెట్టింగ్స్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీ క్లిక్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. వాట్సప్ ను ఎప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉంటే.. మీ ఛాటింగ్‌లో, వాట్సప్ కాల్స్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే యాప్ అప్‌డేట్ చేయడం అనేది చాలా అవసరమని అంటున్నారు. అప్‌డేట్ చేస్తే కొత్తకొత్త ఫీచర్స్ వస్తుంటాయి.