ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవచ్చు. పెద్ద మార్పు వస్తుంది. చాణక్య నీతి ద్వారా అనేక విషయాల గురించి ప్రస్తావించారు. ఆయన నీతి శాస్త్రంలో మానవ జీవిత విధానం గురించి ఎన్నో విషయాలని వివరించారు. మనుషులు ఎక్కడ నివసించాలని కూడా ఆయన ప్రస్తావించారు. కొన్ని చోట్ల వ్యక్తులు ఉండకూడదని.. అలాంటి చోట ఉంటే పేదరికం అనుభవించాలని అన్నారు. చాణక్య చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్య ఐదు ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ పేదలుగా ఉంటారని చెప్పారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు దాని నుంచి బయటపడలేరట. అలాంటి వాళ్ళు మూర్ఖులు గానే బతుకుతారని అన్నారు. బ్రాహ్మణులు లేని ప్రదేశంలో ఉంటే ఎప్పుడూ పేదలు గానే ఉండాలని.. బ్రాహ్మణులు ఎప్పుడూ మతపరమైన పనుల ద్వారా మతాన్ని రక్షిస్తారని అన్నారు. అలాగే వ్యాపారవేత్తలు నివసించని చోట ఉండకూడదని అలాంటి చోట కూడా పేదలుగా జీవిస్తారని అన్నారు.
అద్భుతమైన పాలనాధికారులు లేని చోట ఉండే వాళ్లు కూడా పేదలు గానే ఉంటారని ఎప్పుడూ అభివృద్ధి చెందని చెప్పారు. నదిలేని చోట ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం కష్టంగా ఉంటుందని.. వారు కూడా నిత్యం పేదరికంలోనే కూరుకు పోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే డాక్టర్లు లేని చోట ఉంటే కూడా పేదరికంలో ఉండాల్సి ఉంటుందని.. ఏదైనా వ్యాధి వచ్చిన చికిత్స కావాలని చాణక్య అన్నారు. కాబట్టి ఈ వ్యక్తులు లేని చోట ఎవరైతే ఉంటారో వారు పేదరికం అనుభవిస్తారట.