డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడం పై నటీ హేమ రియాక్షన్ ఇదే..!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమతో పాటు స్నేహితులు వాసు, ఆషిరాయ్, చిరంజీవి డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు నిర్థారించారు. దాదాపు 150 మందికి డ్రగ్స్ టెస్ట్ లు నిర్వహించగా అందులో 86 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. అందులో 59 మంది పురుషులు కాగా.. 27 మంది మహిళలకు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టు నార్కోటిక్ టీమ్ వెల్లడించింది.

డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడం పై నటి హేమ తాజాగా స్పందించారు. తాను ఇప్పుడు ఏమి మాట్లాడు అని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని దురుసుగా సమాధానం చెప్పింది. అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని పేర్కొన్నారు. మరోవైపు తొలుత తాను అసలు పార్టీకి వెళ్లలేదని చెబుతో ఓ వీడియో విడుదల చేసి హేమ.. నిన్నటికి నిన్న ఇంట్లో బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను విడుదల చేశారు. ఈ కేసులో నటి హేమతో పాటు పలువురుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసులతో పాటు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు సైతం వీరిని విచారించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news