మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా బ్లాక్‌ చేయండి..!

-

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అనేక ముఖ్యమైన సేవలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఏ సేవ పొందాలన్నా బ్యాంకులో కస్టమర్లు తమ మొబైల్‌ నంబర్లను కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే ఏ సేవ పొందడం అయినా చాలా సులభతరమవుతుంది. మరీ ముఖ్యంగా డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని సులభంగా బ్లాక్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. మరి ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని కేవలం ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఎలా బ్లాక్‌ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!

  • ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోతే కస్టమర్లు తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ ఫోన్‌ నుంచి BLOCKXXXX అని టైప్‌ చేసి 567676 ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి.
  • ఇక్కడ XXXX అంటే డెబిట్‌ కార్డుపై ముందు భాగంలో ఉండే 16 అంకెల్లోని చివరి నాలుగు అంకెలు అని గుర్తుంచుకోవాలి.
  • ఎస్‌ఎంఎస్‌ పంపగానే కస్టమర్‌కు వెంటనే దాన్ని కన్‌ఫాం చేస్తూ అవతలి వైపు నుంచి ఓ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అలాగే ఒక వేళ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయితే బ్లాక్‌ అయినట్టుగా కన్‌ఫర్మేషన్‌తోపాటు అది బ్లాక్‌ అయిన తేదీ, సమయం వివరాలు మరో ఎస్‌ఎంఎస్‌లో వస్తాయి. ఈ క్రమంలో చాలా సులభంగా ఎస్‌బీఐ కస్టమర్లు పోయిన తమ డెబిట్‌ కార్డులను బ్లాక్‌ చేయవచ్చు.

అయితే ఎస్‌బీఐ బ్యాంక్‌లో కస్టమర్లు తమ ఫోన్‌ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకుంటేనే పై విధంగా పోయిన డెబిట్‌ కార్డులను చాలా సులభంగా బ్లాక్‌ చేయవచ్చు. లేకపోతే అలా చేసేందుకు వీలు కాదు. కనుక కస్టమర్లు తమ తమ మొబైల్‌ నంబర్లను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version