ఏదైనా చిన్న సమస్యలు ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే చాలా మంది పట్టించుకోరు అలా తప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. నిజానికి కొవ్వు పేరుకుపోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, లివర్ సమస్యలు కలుగుతాయి.
డయాబెటిస్ మొదలు బ్రెస్ట్ క్యాన్సర్ వరకూ ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. తక్కువ బరువు ఉన్న వాళ్ళకి కూడా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం మంచిది కాదు. ఫిజికల్ యాక్టివిటీ మొదలు జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వరకు చాలా టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. అలానే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం కూడా చాలా మంచిది. అయితే పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడే వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే మంచిది.
కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండండి:
కొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు కలుగుతాయి అలానే పొట్ట చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోతుంది. దీని వల్ల హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటే బెస్ట్.
ఆల్కహాల్ తగ్గించండి:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య వస్తుంది కాబట్టి తగ్గించడం మంచిది.
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి:
ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా కొవ్వు తగ్గుతుంది. కాబట్టి మీరు గుడ్లు, మాంసం వంటి వాటిని తీసుకోండి.
ఒత్తిడి లేకుండా ఉండండి:
ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటే శారీరిక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది.
పంచదార ని కట్ చేయండి:
పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోతుంది. టైప్ 2 డయాబెటిస్ కి దారి తీస్తుంది. ఇలా ఈ చిట్కాలను మీరు ఫాలో అవ్వడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు సులభంగా తగ్గించుకోవడానికి అవుతుంది.