ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనున్న భారత్‌లో ఒలింపిక్స్ జరగాలని IOC మెంబర్ నీతా అంబానీ ఆకాంక్షించారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రధాని మోడీ బిడ్ వేస్తారని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం నిజంగా భారతదేశానికి గర్వకారణం అని నీతాఅంబానీ వెల్లడించారు. ఒకవేళ బిడ్ వేసి హోస్ట్ చేస్తే గ్రీనెస్ట్ ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఐవోసీ మెంబర్ నీతా హామీ ఇచ్చారు.ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌కు ఇదే సరైన సమయమని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.