జగన్ కు అందుకే పౌరుషం రావడం లేదు.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

-

సోషల్ మీడియాలో తల్లిని, చెల్లిని అవమానిస్తూ.. పోస్టులు చేస్తే జగన్ కు ఏమి అనిపించకపోవచ్చని.. కానీ తనకు రక్తం మరుగుతోందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలపై తప్పుడు పోస్టులు చేస్తే.. సప్త సముద్రాల ఆవల ఉన్నా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లి, చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే కాళ్లు, చేతులు పని చేయని వారికైనా కోపం వస్తుందన్నారు. జగన్ కు జాలి, దయ అనే పదాలకు అర్థం తెలియకనే పౌరుషం రావడం లేదన్నారు.

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అనేక మందిపై కేసులు పెట్టారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. జగన్ మయాంలో పరదాలు పెట్టుకుని సమావేశాలు పెట్టుకున్నారు. సహానాను కొట్టి చంపారని వైద్యులే నిర్దారించారు. నన్ను కులం పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. శాంతి భద్రతల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం. ఏపీ పరువు ప్రతిష్టను జగన్ ఎప్పుడో తీసేశారు. జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు హోంమంత్రి అనిత. 

Read more RELATED
Recommended to you

Latest news