రెండే నిమిషాల్లో కరోనా రిజల్ట్ ?

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవే కాక రిజల్ట్ వచ్చేందుకు సమయం పడుతుంది. ఈ లోపు ఒకవేళ నిజంగా వైరస్ ఉంటే మరి కొంత మందికి కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనుగొన్నారు.

బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను గుర్తించేలా ఒక పరికరాన్ని తయారు చేశారు చెన్నై కీజపక్కంలోనీ కేజే ఆసుపత్రి పరిశోధకులు. కేజే కోవిడ్ ట్రాకర్ పేరుతో పిలిచే ఈ డివైజ్ చూడడానికి ఒక చేయిలాగా ఉంటుంది. ఈ డివైజ్ సాయంతో బీపీ, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్త కణాల సంఖ్యతో బాటు జీటా పోటెన్షియల్ స్థాయిలు కూడా తెలుసుకోవచ్చు. ఆర్ టీ పీసీఆర్ కంటే పక్కాగా ఇది రిజల్ట్ ఇస్తుందని ఆ ఆసుపత్రి వైద్యులు అభిప్రాయపడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news