బిగ్ బాస్ 4: వీళ్ళ ‘మైనస్’లే షో కి ప్లస్ లు అవుతాయా?

-

నిన్న సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ షో సీజన్ 4 ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఈ షోలో ఎవరు పాల్గొనబోతున్నారనే ఉత్కంఠ నెలకొనగా నిన్నటితో ఆ ఉత్కంఠ తొలగిపోయింది. మొదటి నుంచి వినిపించిన పేర్లలోని వాళ్లే ఎక్కువగా ఈ షోకు ఎంపికవగా అంచనాలకు అందని అనూహ్య ఎంపికలు సైతం ఉన్నాయి. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు వాళ్ల మైనస్ లే ప్లస్ లు కాబోతున్నాయా…? అనే సందేహం కలుగుతోంది.

బిగ్ బాస్ షోలో చివరిగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ గంగవ్వ. 57 ఏళ్ల గంగవ్వకు బిగ్ బాస్ షో గురించి కనీస అవగాహన లేదు. ఈ గేమ్ షోలో ఎలా ఆడాలో కూడా ఆమెకు తెలీదు. అయితే ఆమె అమాయకత్వమే ఆమెకు అభిమానులను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో గంగవ్వ పేరిట ఆర్మీలు మొదలయ్యాయి. నోయల్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్నా ఈ మధ్యే ఆయన సతీమణితో విడాకులు తీసుకున్నాడు.

ఈ విడాకులు ఆయనపై ప్రేక్షకుల్లో నెగిటివిటీని పెంచుతాయో లేక నోయల్ పై సింపతీ వర్కవుట్ అయి అభిమానులు పెరుగుతారో చూడాల్సి ఉంది. అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ లకు కొంచెం భాష సమస్య ఉంది. వీళ్లకు తెలుగు స్పష్టంగా రాదు. అయితే గత సీజన్ లో బాబా భాస్కర్ లా వీళ్లు మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఇకపోతే కరాటే కళ్యాణికి సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్లో ఆమెపై వేరే అభిప్రాయం ఉంది.

అయితే ప్రోమో ద్వారా ఆమె తనపై పడిన మరకలను చెరిపేసే ప్రయత్నం చేయడం గమనార్హం. దేత్తడి షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హారిక యూట్యూబ్ వీడియోలలో పద్దతిగా కనిపించి హౌస్ లో పొట్టి దుస్తులు వేయడంపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. అయితే కొందరు అభిమానులు మాత్రం హారిక పొట్టి దుస్తుల్లోనే బాగుందని చెప్పడం గమనార్హం. యాంకర్ లాస్య కొంచెం సున్నితమైన స్వభావం గల మనిషి. బిగ్ బాస్ షోలో ఆమె ఇమడగలదో లేదో చూడాల్సి ఉంది.

ఇక హౌస్ లో మొదట ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనాల్ గుజ్జర్ మాత్రం తన లుక్స్ తోనే అభిమానులను ఆకట్టుకుంది. స్టార్ మా ఫేస్ బుక్ పేజీలలో ఈమెకు పెద్దఎత్తున లైకులు వస్తున్నాయి. స్పష్టంగా తెలుగు రాకపోవడం మోనాల్ కు మైనస్ అయినా ముద్దుముద్దు మాటలతో తన మైనస్ ను మోనాల్ ప్లస్ గా మార్చుకుంటుండటం గమనార్హం. ఇంట్లోకి వచ్చిన ఇతర కంటెస్టెంట్లకు వాటర్ ఇచ్చి మోనాల్ తొలి రోజే మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. ఈ షోలో మోనాల్ కే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version