అర్ధరాత్రి సీక్రెట్ గా.. ఆ యంగ్ హీరోతో గుత్తా జ్వాల ఎంగేజ్‌మెంట్..!

-

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల నిశ్చితార్థం జరిగిపోయింది. తమిళ హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల తాజాగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. నేడు గుత్తా 37వ పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేయసికి శుభాకాంక్షలు చెబుతూ విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు గుత్తా జ్వాల. ఇది మన జీవితాలకు కొత్త ఆరంభం. ఇలానే పాజిటివ్‌గా ఉందాం. మన బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేద్దాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మా కోసం అర్ధరాత్రి సమయంలోనూ ఉంగరం తెచ్చిన బసంత్‌ జైన్‌కు (గుత్తా జ్వాల మేనేజర్‌) ధన్యవాదాలు’ అని తెలిపాడు.

ప్రతుటామ దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే విష్ణు విశాల్ తన కాలేజీ రోజుల్లో నటుడు కే నటరాజ్ కూతురు రజినీ నటరాజ్‌ ను ప్రేమించి 2011 పెళ్లి చేసుకున్నారు. 2017లో కుమారుడు కూడా పుట్టారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో 2018లో విడిపోయారు. దాంతో ఏడేళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. అప్పటి నుంచి జ్వాలా గుత్తా, విష్ణు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version