కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. మన దేశంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. వలస కార్మికులు, కూలీలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు మొదలుకొని బడా బడా పారిశ్రామిక వేత్తలు కూడా కరోనా వల్ల తీవ్రమైన నష్టాలను అనుభవిస్తున్నారు. అయితే ఇంత కష్టకాలంలోనూ ఆ ఒక్క వ్యాపారవేత్త మాత్రం నష్టపోలేదు. పైగా ఆయనకు లాక్‌డౌన్ వల్ల లాభం ఎక్కువగానే వచ్చింది. ఇంతకీ ఆయనెవరు..? అంటే..?
మీకు డి-మార్ట్ గురించి తెలుసు కదా.. బయట రిటెయిల్ షాపులు, సూపర్‌మార్కెట్లతో పోలిస్తే.. అక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే ఆ స్టోర్స్‌లో వినియోగదారులు మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. ఇక డి-మార్ట్ స్టోర్స్ యజమాని రాధాకిషన్ దమని.. ఆయన వ్యాపారంపై కరోనా ప్రభావం పడలేదు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ పేరిట రిటెయిల్ వ్యాపారం ఆయన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టపోయారు. కానీ.. రాధాకిషన్ కు మాత్రం నష్టం రాకపోగా.. పెద్ద ఎత్తున లాభాలే వచ్చాయి.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలను ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ లాభాలను ఆర్జించింది. అందుకనే ఆ కంపెనీకి నష్టాలు రాలేదు. ఇక డి-మార్ట్ షేర్లు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది వ్యాపారవేత్తలకు తీవ్రమైన నష్టాలు వచ్చినా.. రాధాకిషన్ దమనికి మాత్రం లాభాలు రావడం నిజంగానే.. మార్కెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..!