టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఉత్పత్తి చేసే ఐఫోన్లు అధిక ధరలను కలిగి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాపిల్‌కు చెందిన ఐఫోన్ 11 ప్రొ హై ఎండ్ వేరియెంట్ ధర రూ.1 లక్ష వరకు ఉంది. అయితే ఇదే ఫోన్ కు చెందిన ఓ అరుదైన వేరియెంట్ ఏకంగా రూ.2 లక్షల ధరకు అమ్ముడైంది. అవును, నిజమే. ఇంతకీ అందులో స్పెషాలిటీ ఏమిటంటే..?
సాధారణంగా కంపెనీలు ఉత్పత్తి చేసే ఏ ఫోన్ అయినా సరే వాటిల్లో కొన్ని సార్లు మానుఫాక్చరింగ్ లోపాలు ఉంటాయి. అవి కస్టమర్ల వద్దకు వెళ్తే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వేలు, లక్షల ఫోన్లను ఉత్పత్తి చేస్తే లోపాలు ఉండే ఫోన్లు ఒకటో, రెండో ఉంటాయి. అలాగే ఆ ఐఫోన్ 11 ప్రొ ఫోన్ కూడా చిన్న లోపాన్ని కలిగి వచ్చింది. అయితే అది సాంకేతిక లోపం కాదు. డిజైన్ లోపం. ఆ ఫోన్ వెనుక భాగంలో మధ్యలో ఉండాల్సిన లోగో కింద ప్రింట్ అయింది. దీంతో ఆ ఫోన్ అరుదైన వేరియెంట్‌గా మారింది.
A misprint iPhone 11 Pro that sold for 2700$. This misprint is extremely rare- I’d say 1 in 100 million or possibly even rarer. pic.twitter.com/68F7giZAbm
— Internal Archive (@ArchiveInternal) April 9, 2021
అయితే అలా లోగో సరైన ప్లేస్‌లో ప్రింట్ కాని ఐఫోన్ 11 ప్రొ ఫోన్ ఏకంగా రూ.2 లక్షల ధర పలికింది. దాన్ని ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు ? వంటి వివరాలేవీ తెలియవు. కానీ ఆ ఫోన్‌కు చెందిన ఫొటోలు మాత్రం వైరల్‌గా మారాయి. వాటిల్లో ఆ ఫోన్ వెనుక లోగో కొద్దిగా కిందకు ప్రింట్ అయి ఉండడాన్ని గమనించవచ్చు. అయితే లోగో ఇలా మిస్‌ప్రింట్ అయిన ఈ ఫోన్ ను ఎందుకు అంతటి ధర పలికిందనేది అర్థం కాని విషయం. కానీ ఫొటోలు మాత్రం వైరల్‌గా మారాయి.