నాగార్జున సాగర్‌లో ఏర్పాటుచేయనున్న సీఎం సభ ను రద్దు చెయాలని యుగతులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు నిరాకరించింది హైకోర్టు. దీంతో హాలియాలో సీఎం కేసీఆర్ సభకు అడ్డంకులు తొలిగాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలని పిటిషన్లను విచారించడానికి హైకోర్టు నిరాకరించింది.
నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్థి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు వేర్వేరు పెటిషన్ లు దాఖలు చేశారు. అయితే పిటిషన్ లను విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు, కేసీఆర్ సభ 14న కావడంతో సీఎం సభకు అడ్డంకులు తొలిగినట్లేనని అంటున్నారు.