రాష్ట్రంలో మరోసారి గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. తమకు కేటాయించిన ప్రిన్సిపల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై వారం కిందట 18 కిలోమీటర్లు నడిచి కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు గురువారం మరోసారి రోడ్డెక్కారు.
ఈ ఘటన గద్వాల జిల్లాలో ఎర్రవల్లి మండలం బీచుపల్లి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రస్తుత ప్రిన్సిపల్ తమకు వద్దని జాతీయ రహదారిపై గురుకుల బైఠాయించడం అందరికీ షాక్‌కు గురిచేసింది. రాష్ట్రంలోని గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రిన్సిపల్ తమకు వద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కాగా, గురుకులాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అదనపు కలెక్టర్లకు కేటాయించిన విషయం తెలిసిందే.