లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ని తీసుకు రాబోతోంది. ఆర్ధిక సంవతసరంలో పబ్లిక్ ఆఫర్‌కు రావాలని అనుకుంటోంది. దేశంలో అన్ని పబ్లిక్ ఇష్యూలలోకెల్లా ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా మారనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలైలోనే సూత్రప్రాయంగా ఆమోదం కూడా తెలిపింది. ట్రాన్సక్షన్ కోసం పది మంది మర్చెంట్ బ్యాంకర్లను కేంద్రం నియమించింది. అయితే ధరను ఏం రేంజ్‌లో ఆఫర్ చేస్తున్నారు అనేది తెలపలేదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ఎల్ఐసీని ఐపీఓకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ కోసం ఇన్వెస్టర్స్ చూస్తున్నారు. ఈ కంపెనీ ఐపీఓకి వస్తే షేర్లు తప్పనిసరిగా కొనాలని చాలా మంది ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ ఐపీఓలో షేర్లు కొనాలంటే కొన్ని షరతులను పాటించాలి. దానిలో తొలి నిబంధన మీకు డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలన్నా కూడా డీమాట్ అకౌంట్ తప్పక ఉండాలి.
అలానే పాలసీదారుల ఎల్ఐసీ అకౌంట్ కూడా ఉండాలి. ఎల్ఐసి అకౌంట్ అయితే పాన్ కార్డుతో లింక్ చెయ్యాలి. బ్లిక్ ఆఫరింగ్‌లో పాల్గొనాలంటే, పాలసీదారులు తప్పనిసరిగా మీ పాన్ వివరాలను కార్పొరేషన్ రికార్డులలో అప్ డేట్ చేయాలి అని ఎలైసి అంది. ఇంకా ఎవరైనా పాన్ కార్డు వివరాలు అప్ డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోమని అంది.