బిగ్ బాస్ తెలుగు-5 హౌస్ లోకి వ‌చ్చే సింగ‌ర్ ఫిక్స్..!

-

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 కోసం కంటెస్టెంట్ ల ఎంపిక ఇప్ప‌టికే పూర్త‌య్యింది. అంతే కాకుండా క‌రోనా నేప‌థ్యంలో కంటెస్టెంట్ ల‌ను క్వారంటైన్ లో ఉంచిన‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌తీ సీజ‌న్ ప్రారంభం కు ముందు వినిపించిన‌ట్టుగానే ఈ సీజ‌న్ లో కూడా ప‌లువురు కంటెస్టెంట్ లు రాబోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు శ్రీరామ‌చంద్ర ఎంట్రీ ఫిక్స్ అయ్యింద‌ట‌. కాగా వారిలో ఓ సింగ‌ర్ కూడా ఉన్నార‌ట‌. బిగ్ బాస్ ప్ర‌తీసీజ‌న్ లో ఓ సింగ‌ర్ ఉంటారు.

ఇప్ప‌టికే గీతామాదురి, రాహుల్ సిప్లింగ‌జ్, నోయ‌ల్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజ‌న్ లో స్టార్ సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర ఎంట్రీ ఇస్తున్నార‌ట‌. 2010 లో శ్రీరామ‌చంద్ర ఇండియ‌న్ ఐడ‌ల్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా టైటిల్ ను గెలుచుకున్నాడు. దాంతో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌ను పాడారు. మ‌రోవైపు కొన్ని సినిమాల్లోనూ న‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news