ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఫేక్ వార్తలను కనుక నమ్మరంటే మోస పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ వార్తలు హల్చల్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటిని మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అప్డేట్ గురించి చూద్దాం.
ఒక వెబ్ సైట్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. పైగా వివిధ రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు కూడా చెప్పింది. ఆ వెబ్సైట్ పేరు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC). అదే ఓ ఫేక్ వెబ్సైట్ అని ఇప్పుడు బయట పడింది.
A website impersonating @OfficialDMRC is inviting applications for various posts #PIBFactCheck
▶️This website is #Fake
▶️All recruitment related notifications are uploaded on DMRC’s official website: https://t.co/Iu2xrS3b6P only pic.twitter.com/hv9uK7HO1c
— PIB Fact Check (@PIBFactCheck) October 25, 2021
ఇవి కేవలం ఫేక్ వెబ్సైట్ అని దీనిలో ఏ మాత్రం నిజం లేదని పరిశీలించి చూస్తే తెలిసింది. అదే విధంగా ఈ పోస్ట్స్ కి అప్లై చేయాలంటే పేరు, డేట్ అఫ్ బర్త్, జండర్ వంటి వివరాలను ఇవ్వాలని చెబుతోంది. అయితే ఇలాంటి ఫేక్ వెబ్సైట్లలో మీరు సమాచారాన్ని ఇవ్వద్దు.
వీటి వల్ల నష్టం కలుగుతుంది. ఎప్పుడైనా సరే అఫీషియల్ నోటిఫికేషన్స్ ని మాత్రమే చూడండి. website delhimetrorail.com లాంటి ఫేక్ వెబ్సైట్లలో మీరు సమాచారాన్ని కనుక ఇచ్చారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇది ఫేక్ వెబ్సైట్ అని గుర్తించండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.