వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత మంచి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వందకోట్ల కలెక్షన్లు సాధించింది. ఎఫ్ 2 సక్సెస్ అవడంతో అనిల్ రావిపూడి, దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కిస్తానని చెప్పాడూ. ఆల్రెడీ ఎఫ్ 3 స్క్రిప్టు పనులూ పూర్తయ్యాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమ తమ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇంకా పట్టాలెక్కడం లేదు.
ఐతే తాజాగా ఈ సినిమాపై అనేక పుకార్లు వచ్చాయి. ఎఫ్ 3 సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణం, వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచడమే అని, అదీగాక వెంకటేష్ తో సరిపడా స్క్రీన్ స్పేస్ కావాలంటున్నందునే అని వార్తలు వచ్చాయి. కానీ నిజానికి, వరుణ్ తేజ్ అలాంటి కామెంట్లు చేయలేదట. ఎఫ్ 3 చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాడట. పారితోషికం గురించి గానీ, స్క్రీన్ స్పేస్ గురించి గానీ తన మైండ్ లోనే లేదని ఫిలిమ్ నగర్ వార్తల సారాంశం.