పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను 10 ఏళ్లుగా మోసం చేశాడని.. లైంగికంగా కూడా వేధించాడని.. మీడియా వేదికగా వెల్లడించింది.
ఇప్పుడిదే పాకిస్తాన్, క్రికెట్ అభిమానుల్లో, ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాధితురాలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “బాబర్ తానూ స్కూల్లో స్నేహితులమని.. అతను కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంటే ఉన్నానని… అతనికి ఆర్థికంగా కూడా సాయం చేశానని వెల్లడించింది. 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని బాబర్ తనకు చెప్పి ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడని దానికి తానూ అంగీకరించానంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడని దానితో పెళ్లి కొంతకాలం వాయిదా వేసుకుందామని తెలిపాడని పేర్కొనింది. ఆ మ్యాచ్‌తో అతనికి చాలా ఫేమ్ వచ్చిందని.. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడని ఈ క్రమంలోనే బాబర్ మనసు మార్చుకున్నాడంటూ ఆరోపించింది.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని బాబర్ తనను బెదిరించాడని తెలిపింది. తనపై శారీరకంగా కూడా దాడి చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ తాను ఫిర్యాదు చేశానని అయినా.. పాక్ క్రికెట్ బోర్టు పట్టించుకోలేదంటూ ఆరోపించింది.
కాగా, పాకిస్తాన్ క్రికెట్ టీం సభ్యులపై కూడా గతంలో అనేకమైన లైంగిక ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రముఖులపై ఎవరోఒకరు బురదజల్లే ప్రయత్నం చేస్తుంటారంటూ వాటిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇక కొద్ది రోజుల క్రితమే అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాబర్ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం జట్టుతో కలిసి అతను న్యూజిలాండ్‌లో ఉన్నాడు. డిసెంబర్ నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది.