ధన బలం చూపెట్టేవారు రేపు ప్రజాసేవ చేయరు – పాల్వాయి స్రవంతి

-

మునుగోడు ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు ధన, అధికార బలాన్ని వాడుతున్నాయని ఆరోపించారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ నాయకులను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వినకుంటే బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నుండి మంత్రులు, కేంద్రం నుండి మంత్రులు మునుగోడు గ్రామాలని దత్తత తీసుకుని ఒక మహిళగా నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

“మునుగోడు ప్రజలకు నా విజ్ఞప్తి ఇలా ధన బలం చూపెట్టే వారు రేపు ప్రజాసేవ చేయరు” అని పేర్కొన్నారు పాల్వాయి స్రవంతి. ధన, అధికార బలం ఎంతున్నా.. మునుగోడు ఓటరు మహాసేయులు తననే ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సిగ్గు, శరం వదిలి టిఆర్ఎస్, బిజెపి పార్టీలు డబ్బు, లిక్కర్ తో ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. బిజెపి కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ముతో మునుగోడులో ఓట్లని కొనుగోలు చేస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news