కేసీఆర్ కోటలో ‘తోట’..సూపర్ ఛాన్స్ మిస్..!

-

తోట చంద్రశేఖర్..బీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు వరకు..ఈయన పేరు పెద్దగా ఏపీ రాజకీయాల్లో ఎక్కువసార్లు వినపడిన సందర్భం లేదు. ఏదో ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్నారని తెలిసేది గాని..ఆ తర్వాత ఈయన పేరు ఎక్కడా వినబడేది కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ప్లాన్ చేసి..కొందరు నేతలని చేర్చుకోవడం..అందులో తోట చంద్రశేఖర్ కూడా ఉండటం…పైగా ఆయనకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు పదవి ఇవ్వడంతో..తోట పేరు ఈ మధ్య కాస్త వినబడటం మొదలైంది.

అది కూడా జనసేన పార్టీ నుంచి తోట బీఆర్ఎస్ లో చేరారు. అయితే తోట బీఆర్ఎస్ లో చేరి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా? ఇంకా ఆయన విజయానికి దూరమైనట్లేనా అంటే..పరిస్తితి అదే నిజమనిస్తుంది. ఎందుకంటే మూడు ఎన్నికలు మూడు పార్టీల్లో పోటీ చేసి తోట ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి..గుంటూరు పార్లమెంట్ లో ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇలా మూడుసార్లు ఓడిపోయిన తోట.ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఓట్లు వేలు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన డిపాజిట్లు కాదు కదా…నోటాకు పడే ఓట్లు దాటిన గొప్పే అని విశ్లేషకులు అంటున్నారు. ఇటు తోటకు సొంత ఫాలోయింగ్ లేదు..కాబట్టి గెలుపు గురించి మాట్లాడాల్సిన పని లేదు.

కానీ ఆయన జనసేనలోనే ఉంటూ..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో ఏదొక సీటు దక్కితే..గెలుపు అవకాశాలు చాలా మెండుగా ఉండేవి. మొత్తానికి బీఆర్ఎస్ లో చేరి..మరో ఓటమికి దగ్గరయ్యారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version