కరోనా వైరస్.. ఇది ఒక్కరికి సోకితే చాలు, ఆ వ్యక్తి నుంచి ఎందరికో సోకుతుంది. అందుకే బోతిక దూరం తప్పనిసరిగా చెప్తున్నారు నిపుణులు. ఇప్పటికే దీనిపై ఎన్నో సందేశాలు వచ్చాయి. ప్రముఖులు సైతం బౌతిక దూరం పాటించమని చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా చాలా వరకు దీన్ని పాటిస్తున్నారు. కానీ, అక్కడక్కడా కొంతమంది మంత్రం దీనిమీద అవగాహన లేకనో ఏమో గాని దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు.
దీనివల్ల వల్ల చాలా పెద్ద ప్రమాదమే ఉంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే కరోనా కేసులు వెయ్యికి చేరుకున్నాయి. ఇప్పటివరకు 98 వేల మంది నుండి శాంపిల్స్ సేకరించగా, వారిలో 1060 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరిలో 663 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 386 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో జిల్లాలో 130 ప్రదేశాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.