ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ… ప్రధాని మోదీకి ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ వార్నింగ్.

-

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ.. సిఖ్ ఫర్ జస్టిస్  ఉగ్రవాద సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను, ప్రధాని నరేంద్ర మోడీని వార్నింగ్ చేస్తున్న వీడియోను విడుదల చేశాడు. జనవరి 5న ‘తిరంగే వాలే (భారతీయులు)’ పంజాబ్ నుండి ఢిల్లీకి పారిపోయాడని ‘ఖండే మరియు కేస్రీ వాలే (సిక్కులు)’ బలవంతంగా ఖలిస్తాన్ రిఫరెండం ప్రచారం ప్రారంభించారని అన్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పారిపోయాడని ప్రగల్భాలు పలికాడు. పంజాబ్ స్వాతంత్య్రం వైపు మొదటి అడుగులు వేసిందని గురుపత్వంత్ సింగ్ పన్ను అన్నాడు. పంజాబ్ ప్రజలు ఈరోజు తమ నిర్ణయం తీసుకున్నారు. మోదీ మరియు ఆయన ప్రభుత్వం దృష్టి సారించాలని హెచ్చరించాడు. భారతీయులకు మద్దతు ఇచ్చేవారు పంజాబ్ వదిలి ఢిల్లీకి పారిపోవాలని హెచ్చరించాడు. నిన్న పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల కారణంగా మోదీ వెనుదిరిగారు.

అయితే సిఖ్ ఫర్ జస్టిస్ నాయకులు ఎప్పటి నుంచో ఖలిస్తాన్ కలలు కంటున్నారు. గతంలో కూడా ఇలాగే రెచ్చగొట్టే విధంగా వీడియోలు విడుదల చేశాడు. అయితే వీరికి పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు కూడా ఉందనే విమర్శలు ఉన్నాయి. గతంలో గురుపత్వంత్ సింగ్ పన్ను.. పంజాబ్ విముక్తి, ఖలిస్తాన్ ఏర్పాటుకు సహకరించాలని పాక్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news