కేంద్ర మంత్రికి బెదిరింపు కాల్స్.. రూ.10కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ..

-

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. రూ. 10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి ఓ వ్యక్తి మూడు సార్లు కాల్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. గడ్కరీ కార్యాలయ సిబ్బంది సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెదిరింపు కాల్స్​ చేసిన వ్యక్తి తనను తాను జయేశ్ పుజారిగా చెప్పుకున్నాడని నాగ్​పుర్​ రెండో జోన్​ డిప్యూటీ సీపీ రాహు మాడనే తెలిపారు. ఇవాళ ఉదయం రెండు సార్లు.. మధ్యాహ్నం ఒకసారి ఫోన్​ చేసి రూ. 10 కోట్లు డిమాండ్​ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. ఆ కాల్స్​ చేసిన వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి చేస్తున్నాడో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్​ వచ్చిన నంబర్​ను మంగళూరులోని ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. అయితే, ఈ కాల్​ ఆ మహిళే చేసిందా?.. లేదా జయేశ్​ పూజారి అనే వ్యక్తి చేశాడా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జయేశ్​ పూజారి.. ఓ మర్డర్​ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news