హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. ఊహించని విధంగా ముంచుకు వస్తున్న ప్రమాదాలతో హైదరాబాద్ వాసులు భయపడిపోతున్నారు. ఎటు నుంచి చావు వస్తుందో అర్ధం కాక రోడ్డు మీదకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం అతి వేగం.
వేగంగా వెళ్ళాలి అనే తపన ఒకటి అయితే వేగంగా వెళ్ళడం అనే ఇష్టం, పిచ్చి తో ప్రాణాలు ఎక్కువగా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం నాడు నగరంలో జరిగిన ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. హయత్‌నగర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఉదయం ఒక ప్రమాదం జరిగింది.
కేటీఎం బైక్‌పై అతి వేగంగా వెళ్తున్న యువకుడు అడ్డుగా వచ్చిన కుక్కను గుద్దాడు. దీనితో అక్కడిక్కడే తలకు బలమైన గాయం అయి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కు అడ్డుగా వచ్చింది. కుక్కను ఢీకొట్టిన బైక్ అనంతరం డివైడర్‌ను ఢీకొట్టగా… డివైడర్‌పై పడిపోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో కుక్కు కూడా చనిపోయింది. దీనికి కారణం అతివేగమే అని గుర్తించారు అధికారులు. ఇలా అతి వేగంతో వరుసగా నగరంలో ప్రాణాలు కోల్పోతున్నారు యువకులు. ఎన్ని జరిమానాలు విధించినా సరే మార్పు మాత్రం రావడం లేదు.