బ్రేకింగ్‌: భ‌గ‌భ‌గమంటున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

బంగారం ధ‌ర‌ ఈ రోజు కూడా పైపైకే క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.990 పెరుగదలతో రూ.43,430 నుంచి రూ.44,420కు చేరింది. బంగారం ధర రూ.45 వేల మార్క్‌కు ఇంకొంచెం దూరంలోనే ఉంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. ఏకంగా రూ.910 పెరిగింది. దీంతో ధర రూ.39,810 నుంచి రూ.40,720కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.1100 పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.49,900 నుంచి రూ.51,000కు ఎగసింది.

విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.910 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,720కు చేరింది. వెండి ధర రూ.51 వేలకు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర రూ.940 పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,600కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news