నిన్నటితో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ ను పూర్తిచేసుకుంది. కరోనా ను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పది లక్షల మందికి 14 వేల మందిని టెస్ట్ చేసింది ప్రభుత్వం అయినా కరోనా స్వైర విహారం చేస్తూనే ఉంది. ఇక ఏపీ లోని గుంటూరు జిల్లా లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. సాధారణంగా మనకు కరోనా వస్తే వెళ్ళేది డాక్టర్ల దగ్గరకు అదే డాక్టర్లకే కరోనా వస్తే ఎక్కడకు వెళ్ళాలి..? ఇప్పుడు ఇలాంటి పరిస్థితే అక్కడ నెలకొంది. గుంటులోని జీజీహెచ్ ఆసుపత్రిలో ఏకంగా ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల అత్యాచారానికి గురై జీజీహెచ్ లో చేరిన ఓ బాలికకు ఈ ముగ్గురు డాక్టర్లు చికిత్స అందించారు. ఆ బాలికతో పాటు, ఆమె తల్లికి కూడా అప్పటికే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ బాలికకు చికిత్స అందించడంతో డాక్టర్లకు కూడా సోకింది. డాక్టర్లకు కూడా కరోనా అని నిర్ధారణ అవ్వడంతో అక్కడి ప్రజలు పెషంట్లు భయాందోళనకు గురవుతున్నారు.
గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు కరోనా..!
-