ఏపీ సచివాలయం ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వరకు నుండే ఉన్న వెసులుబాటునే ఇప్పుడు మరో సంవత్సరం పొడిగించారు. హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు గా వెసులుబాటు ఇస్తూ ఇది వరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు ఇదే నిర్ణయాన్ని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశాడు. గత ఉత్తర్వుల ప్రకారం ఐదు రోజుల పనిదినాల వెసులుబాటు గడువు నేటితో పూర్తికానుంది. కాగా ఇదే విషయాన్ని కార్యాలయం అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ ఇదే నిర్ణయాన్ని మరో సంవత్సరం పాటు పొడగించారు. సీఎం నిర్ణయం పట్ల కార్యాలయం అధికారులు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త..! వారానికి ఐదు రోజుల పనిచేస్తే చాలు..!
-