తెలంగాణలో ముగ్గురు రైతుల ఆత్మహత్య

తెలంగాణలో భోగి పండున రోజున ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక.. తెలంగాణలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు వెల్మకన్నె గ్రామానికి చెందిన బరిగెల మల్లయ్య అనే రైతు పంటల సాగుతో పాటు తన కుమార్తె వివాహానికి రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే.. ఆ అప్పు తీర్చ లేక నిన్న పురుగులు మందు తాగి సుసైడ్‌ చేసుకున్నాడు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్‌ గ్రామానికి చెందిన బి. మురళి పెట్టుబడి కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు.

అయితే.. ఈ సారి దిగుబడి రాకపోవడంతో.. అప్పు తీర్చ లేకపోయాడు. ఈ నేపథ్యంలోనే.. నిన్న పురుగులు మందు తాగేశాడు మురళి. అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఘటనలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్ద గొపతికి చెందిన దామా బాలస్వామి పంటల సాగుకు రూ.6 లక్షల మేర అప్పులు చేశారు. పంట చేతికందొచ్చినా సరైన ఆదాయం రాకపోవడంతో అప్పుఉల తీర్చే మార్గం కనిపించలేదు. దీనికి తోడు రుణదాతలు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక శుక్రవారం పొలంలోనే పురుగుల మందు తాగి సుసైడ్‌ చేసుకున్నాడు.