హైదరాబాద్‌ లో దారుణం..కన్నకూతురిపైనే ఆటోడ్రైవర్ అత్యాచారం !

-

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురుపై నే తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసించే ఆటో డ్రైవర్‌ భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం ఇంటికొచ్చిన సోదరుడితో కలిసి పిల్లలను తీసుకుని వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

అయితే.. కుమార్తెను, ఇద్దరు కూమారులను తన వద్దనే ఉంచుకుంటారని భర్త చెప్పడంతో ఆమె సోదరుడితో కలిసి వెళ్లింది. ఈ నెల 9న యథావిధిగా ఇంటికొచ్చిన తండ్రి అర్థరాత్రి దాటిన తర్వాత కుమార్తె నోరు నొక్కి రెండుసార్లు లైంగిక దాడకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి తెలియజేయగా.. ఇద్దరూ కలిసి మహబూబ్‌ నగర్‌ లో ఉన్న తల్లి వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని కుమార్తె తల్లితో చెప్పడంతో శుక్రవారం నగరానికి వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తండ్రిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news