మహిళల కి గుడ్ న్యూస్.. కేంద్రం నుండి రూ. 3 లక్షల లోన్..!

-

కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కోసం కూడా ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది కేంద్రం. ఉద్యోగిని పేరు తో మహిళలకు రూ. 3 లక్షల రుణం ని ఇస్తోంది. వివరాలని చూస్తే.. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల లోన్ ని కేంద్రం అందిస్తోంది.

88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు. అర్హతలున్న మహిళలు ఈ కేంద్రం ప్రభుత్వం స్కీమ్ తో రూ. 3 లక్షల వరకు రుణం పొందొచ్చు. అలానే అంగవైకల్యం, వింతత మహిళలకు కూడా ఈ స్కీము ప్రయోజనాలని ఇస్తున్నారు. పైగా వ్యాపారం ఆధారంగా రుణ పరిమితి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక భరోసా ని ఈ స్కీము తో కల్పిస్తున్నారు.

ఆత్మ నిర్భర్‌ కార్యక్రమ లక్ష్యాల్లో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 10 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ మీద రుణం ని ఈ స్కీము కింద అందిస్తారు. అంగవైకల్యం, వితంతు మహిళలకు అయితే వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వాళ్ళు ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. క్రెడిట్‌ స్కోర్‌, సిబిల్ స్కోర్‌ ఆధారంగా లోన్ ఇస్తారు. ఆధార్‌ కార్డు, ఇన్‌కమ్‌ ప్రూఫ్‌, రెసిడెన్సీ, కాస్ట్‌ సర్టిఫికేట్‌, బ్యాంక్‌ ఖాతా బుక్ వంటివి కచ్చితంగా ఉండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news