స్టార్‌హీరో కొడుకు వేధింపులు.. రూమర్స్ పై కృతిశెట్టి రియాక్షన్ ఇదే

-

టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టి వరుస అవకాశాలతో తన సత్తా చాటుతోంది. తక్కువ సమయంలో ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ లో బిజీ అయింది. అయితే తాజాగా కృతికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ స్టార్‌ హీరో తనయుడు కృతిని వేధించాడని, స్నేహం చేయమంటూ ఫోన్‌ చేసి విసిగించాడని, ఎక్కడికి వెళ్లినా తోడు రమ్మనేవాడని.. తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వెలువడ్డాయి.

తాజాగా ఈ రూమర్స్ పై కృతి రియాక్ట్ అయింది. ‘‘దయచేసి ఇలాంటి కథనాలు సృష్టించి.. అసత్య ప్రచారాలు చేయడం మానండి. ఈ నిరాధారమైన వార్తలను పెద్దగా పట్టించుకోకూడదని మొదట అనుకున్నాను. అంతకంతకు ఈ ప్రచారం మరింత విస్తృతంగా మారుతోన్న తరుణంలో స్పందించక తప్పడం లేదు’’ అని ఆమె తెలిపారు. కృతిశెట్టి ట్వీట్‌తో ఆ కథనాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news