చిత్తూరు జిల్లా కుప్పం లో దారుణ సంఘటన జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను కడుతూ ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 13 మంది కరెంట్ షాక్ కు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారని అక్కడి స్థానికులు మీడియాకు వివరించారు.
కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ఈ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముందు ముగ్గురు మరణించారు అని చెప్పినా ఆ తర్వాత నాలుగు అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తింపు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.