కేంద్ర ఆర్థిక మంత్రి మాటలపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు..

-

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి మాటలపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేసారు. చిదంబరం మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఆర్థిక పరిస్థి బాగా దెబ్బతిందని మాట్లాడడం సరికాదని, జీడీపీలో 24శాతం తగ్గుదలకి కారణం కరోనా వైరసే అని నిందించవద్దని అన్నారు. ఇంకా కరోనా వైరస్ ప్రకృతి విపత్తు అనీ, కానీ మీరు ఆ విపత్తుని మానవ నిర్మిత విపత్తుతో ఇంకా ఎక్కువ చేస్తున్నారని వ్యాఖ్యలు చేసారు.

 


జీఎస్టీ నష్టాల కారణంగా రాష్ట్రాలు పరిహారం చెల్లించాలని కోరగా, నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, మహమ్మారిని కారణంగా చూపుతూ ఆక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చిదంబరం ఇంకా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నుండి కోలుకోవడానికి మార్గాలు కూడా సూచించారు. ముందుగా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి కొనుగోలు శక్తిని పెంచాలని, తద్వారా డిమాండ్ పెరిగి ఆర్థికంగా బలపడతామని స్పష్టం చేసారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news