సిరిసిల్ల లో దారుణం.. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి.. మరో 5 గురు గల్లంతు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా దారుణం చోటు చేసుకుంది. ఎనిమిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. ప్రస్తుతం ఆ పిల్లల కోసం గాలిస్తున్నాయి సహాయక బృందాలు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మానేరు డ్యామ్ స్టోరేజ్ వాటర్ వద్ద ఈత కోసం వెళ్లి విలవిలలాడుతూ మునిగిపోయిన విద్యార్థులు, ఇది చూసి భయంతో ముగ్గురు పిల్లలు అక్కడి నుండి పరారీ అయ్యారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న సహాయక బృందాలకు మూడు మృతదేహలే లభ్యం అయ్యాయి.

మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎనిమిది మంది విద్యార్థులు సిరిసిల్ల కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్ కు చెందిన వారుగా తెలుస్తోంది. ఈతకు వెళ్లిన విద్యార్థులు “కొలిపాక గణేష్, జడల వెంకట సాయిల మృత దేహాలు లభ్యం అయ్యాయి. శ్రీరామ్ క్రాంతికుమార్, వాసాల కళ్యాణ్, తీగల అజయ్, ఊర రాకేష్, దిడ్డి అఖిల్, కోట అరవింద్ లు గల్లంతు అయ్యాయి.

నిన్న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లారు విద్యార్థులు. వాళ్ళు గల్లంతు కావడంతో నిన్న సాయంత్రం 4:00 నుండి ఈ రోజు వరకు నిద్ర లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శోకసముద్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. ఘటనకు సంబంధించిన మృతదేహాల కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు అధికారులు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news