ఛత్తీస్ గడ్ లో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్ లతో మావోయిస్ట్ పార్టీ కీలక నేతలను పోగొట్టుకుంది. కాగా తాజాగా మరో కీలక నేత ఎన్కౌంటర్ లో మరణించారు. నారాయణ్ పూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చనిపోయింది కంపెనీ కమాండర్ సాకేత్ గా పోలీసులు గుర్తించారు. చోటే డొంగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కూబింగ్ కోసం డీఆర్జీ జవాన్లు వెళ్ళగా నక్షల్స్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ నేత సాకేత్ మృతి చెందారు. ప్రస్తుతం జవాన్ల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇక రీసెంట్ పలు ఎన్కౌంటర్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో వైపు పలువురు మావోయిస్ట్ నేతలు అనారోగ్యం భారిన పడి ఆస్పత్రుల పాలు అవుతున్నారు. మరికొందరు ఇప్పటికే మరణించారు.