ఐస్ గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్ ఘడ్ లోని రాజ్నందావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రాజనంద్వ్ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల బాలుడు ఖుశాంత్ సాహు తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. వివాహ వేడుకలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్వాహకులు డ్రై ఐస్ ను ఉపయోగించారు.
సాధారణ ఐస్ గా భావించిన ఓ చిన్నారి దానిని తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. డ్రై ఐస్ ని మౌత్ ఫ్రెషనర్ భావించి తినడం వల్ల ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైన ఘటన ఇటీవల గురుగ్రామ్ లోని ఓ కేఫ్ చోటుచేసుకుంది. బాధితులు నోట్లో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు.