ఏపీకి ఫొని తుపాను గండం తప్పిందని సంతోషపడుతన్న లోపే మరో గండం ముంచుకొస్తోంది.. వాతావరణ శాఖ అధికారులు ఏపీకి మరో గండం పొంచి ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని కొన్ని చోట్ల పిడుగులు పడనున్నాయట. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖపట్టణం, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే కొద్ది రోజుల్లో ఏపీలో వర్షాలు పడనున్నాయని ముందే హెచ్చరించిన వాతావరణ శాఖ.. వర్షాలతో పాటు.. పిడుగులు కూడా పడనున్నాయట. అందుకే.. వర్షం పడే సమయంలో ప్రజలు బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవే కాదు.. రాబోయే రోజుల్లో ఎండ కూడా బీభత్సంగా కొడుతుందట. 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందట. ఓ వైపు వర్షాలు.. మరో వైపు పిడుగులు.. ఇంకో వైపు సుర్రుమంటున్న ఎండలు.. ఏం వాతావరణం.. ఇన్ని వేరియేషన్లా అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.