పులుల గణనకు వెళ్లిన మహిళా ఫారెస్ట్ అధికారిపై పులి దాడి… తాడోబా అటవీ ప్రాంతంలో ఘటన

-

తాడోబా- అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పులుల గణన కోసం వెళ్లిన మహిళా ఫారెస్ట్ రేంజర్ పై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా టైగర్ రిజర్వ్ కోలారా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా ఫారెస్ట్ రేంజర్ స్వాతి ధుమ్నే(43) శనివారం ఉదయం తన విధుల్లో ఉండగా పులి దాడి చేసింది. తాడోబా ప్రాజెక్ట్ లో పులుల గణనలో ఉండగా దాడి చోటు చేసుకుంది.

పులుల లెక్కింపులో భాగంగా కోర్‌ జోన్‌ 97లో కోలార గేటు వద్ద ట్రాజెక్టరీ లైన్‌ వేసే పనులు శనివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఫారెస్ట్ రేంజర్ స్వాతి ధుమ్నే కూడా పనికి సిద్ధమయ్యేందుకు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో మాయ అనే పులి వారిపై దాడి చేసింది. అతనితో పాటు ఉన్న నలుగురు అటవీ సిబ్బంది పులిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే పులి స్వాతిని దట్టమైన అడవిలోకి లాక్కెల్లింది.
సమాచారం అందుకున్న తాడోబా టైగర్ రిజర్వ్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సెర్చ్ ఆపరేషన్ లో మృతదేహం లభ్యమైంది

Read more RELATED
Recommended to you

Latest news